సత్యసాయి: కదిరి సబ్ డివిజన్ నల్లచెరువు పోలీసు పరిధిలో 2023లో హత్యకు గురైన అమర్ నాథ్ కేసును 2 సంవత్సరాల తర్వాత ఛేదించారు. షేక్ దాదాపీర్, పఠాన్ మహమ్మద్ యాసిన్, పటాన్ సాధిక్ బాషలను హత్యకేసులో అరెస్ట్ చేశారు. SP సతీష్ కుమార్ ఆదేశాలతో కదిరి డీఎస్పీ, పోలీసు బృందం చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి నిజానిజాలు వెలికితీశారు. ప్రజలు పోలీసుల కృషిని ప్రశంసిస్తున్నారు.