విజయనగరంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న శ్రీ పైడితల్లమ్మ పండగకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ దామోదర్ తెలిపారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. కమాండ్ కంట్రోల్ రూమ్, రూఫ్ టాప్, నేరాల నియంత్రణకు ప్రత్యేక క్రైమ్ బృందాలు, బాంబ్ తనిఖీ బృందాలు పనిచేస్తాయన్నారు.