SKLM: నరసన్నపేట మండలం కామేశ్వరి పేట గ్రామానికి చెందిన కణుగుల దామోదర్ రావు (37) శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామంలోని చెరువుకు వెళ్లారు. చెరువు లోతుగా ఉండటంతో జారిపడి చెరువులోపడ్డారు. గమనించిన స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.