కృష్ణా: కృష్ణా జిల్లాలోని 11,316 మంది ఆటో డ్రైవర్లకు “ఆటో డ్రైవర్ల సేవలో” పథకం కింద రూ.16.97 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు చెక్కులను పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.