SRCL: జిల్లాలో సరుకు, ప్రయాణికులను చేరవేసే వాహనాలకు సంబంధించిన 4,419 గల వాహనాల యజమానులు పన్ను చెల్లించాలని జిల్లా ఇంఛార్జి రవాణా శాఖ అధికారి వంశీదర్ ఒక ప్రకటనలో సూచించారు. ఆయా వాహనాలు రోడ్డు టాక్స్ కట్టకుండా వినియోగిస్తున్నారని తెలిపారు. సిరిసిల్ల డివిజన్‌కు సంబంధించి 2,787 వాహనాలు, వేములవాడ డివిజన్‌కి సంబందించి 1,632 వాహనాలు ఉన్నాయని వెల్లడించారు.