KDP: కార్తీక మాసంలో భక్తులు సిద్ధవటం నిత్య పూజయ్య స్వామికి సమర్పించిన తలనీలాలను శనివారం వేలంపాట వేశారు. పోటా పోటీగా జరిగిన ఈ వేలం పాటలో చాపాడు మండలం పల్లవోలు గ్రామానికి చెందిన పాటదారుడు రామకృష్ణ రూ. 3.30 లక్షలకు తలనీలాలు దక్కించుకున్నాడు. ఈ వేలంపాటలో ఆలయ అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.