హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల ఆరవ తేదీ సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకునే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.