KMM: మధిర పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ అధ్యక్షతన ఏబీసీడి క్లస్టర్ ఇంఛార్జ్ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ప్రతి క్లస్టర్ బాధ్యత తీసుకోని, అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించాలన్నారు.