KNR: హుజూరాబాద్ మాజీ జడ్పీటీసీ పడిదం బక్కా రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన బక్కా రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున జడ్పీటీసీగా గెలుపొందారు. ఆయన మృతి పట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు.