MLG: జిల్లా ZP ఛైర్పర్సన్ సీటు ST (W) రిజర్వ్ కావడంతో రాజకీయ వారసుల పోటీ తీవ్రమైంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు రాష్ట్ర ముఖ్య నేతలు తమ కోడళ్లను రాజకీయ వారసులుగా రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి, అధిష్ఠానం వద్ద లాబీయింగ్‌ను ముమ్మరం చేశారు. ఒకరు లంబాడా, మరొకరు కోయ వర్గానికి చెందినవారు ఉన్నారు.