JGL: మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో మాజీమంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జువ్వాడి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేరెళ్ల శ్రీనివాస్, దిలీప్,భూమారెడ్డి, జీవన్ రెడ్డి, పసుల సుమన్, తదితరులు పాల్గొన్నారు.