E.G: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకంలో ఎవరూ నష్టపోకుండా చూసుకున్నామని తూర్పుగోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు ఎమర్జెన్సీ సమయంలో అందరికీ గుర్తొచ్చే వాహనం ఆటో అని, అలాంటి సేవలు అందించే డ్రైవర్లను ప్రభుత్వం గుర్తించడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ మేరకు శనివారం రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.