SKLM: సోంపేటలో రెండు రోజులు పాటు నిర్వహించే సీఐటీయూ జిల్లా మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ మహాసభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ రావు మాట్లాడుతూ.. కార్మిక వర్గ పోరాటాల ద్వారానే మన హక్కులను సాధించుకోగలమని తెలిపారు. అనంతరం సీఐటీయు జెండాను ఆవిష్కరించారు. పలువురు సీఐటీయు నాయకులకు నివాళులర్పించారు.