BHPL: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పలు గ్రామాల్లో శనివారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. ఇటీవల వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.