కోనసీమ: స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వివిధ కేటగిరీలలో మొత్తం 49 అవార్డులు లభించాయని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రాలతో పాటు ఈ అవార్డులు దక్కాయని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేసి ఈ ఘనత సాధించారని కలెక్టర్ పేర్కొన్నారు.