WGL: నర్సంపేట నియోజకవర్గంలో దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నారు. ఇటీవల పలు గ్రామాల్లో సోలార్ బ్యాటరీలు దొంగిలించిన దుండగులు, దసరా రోజు ఖానాపురం మండలం దబ్బీర్పేట ప్రభుత్వ పాఠశాలలో ఆరు సోలార్ బ్యాటరీలను అపహరించారు. మరుసటి రోజు నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తలుపులు పగలగొట్టి దొంగతనానికి యత్నించారు.