NLR: విజయవాడలో “ఆటో డ్రైవర్ల సేవలో” మహా కార్యక్రమానికి జగ్గయ్యపేట నియోజకవర్గం ఆటో డ్రైవర్లు, వాహన మిత్రులు తరలి వెళ్తున్న బస్సులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఆటో డ్రైవర్లు మన సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి సేవలు గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు ప్రతి డ్రైవర్ కుటుంబానికి బలం నిలుస్తాయని పేర్కొన్నారు.