BPT: అద్దంకి మండలం సింగరకొండలోని 99 అడుగుల శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు శనివారం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి పాలకమండలి సభ్యులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. శనివారం కావడంతో అభయాంజనేయస్వామి విగ్రహం వద్ద భారీగా భక్తుల సందడి నెలకొంది.