BPT: ఎస్పీ ఉమామహేశ్వర్ శనివారం జిల్లా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ నేరగాళ్లు వినూత్న రీతిలో నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజల మొబైల్ ఫోన్లకు వాట్సాప్ ద్వారా APK ఫైల్స్ పంపించి తద్వారా ఫోన్ హ్యాక్ చేస్తున్నారన్నారు. బ్యాంకు, వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తున్నారని తెలిపారు. ప్రజలు APK ఫైల్స్ డౌన్లోడ్ లేదా ఓపెన్ చేయొద్దని ఆయన హెచ్చరించారు.