వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. దీంతో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న విండీస్ తొలి సెషన్లో 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 240 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం అలిక్ (17*), జస్టిన్ (0*) క్రీజులో ఉన్నారు. జడేజా 3 వికెట్లు.. సిరాజ్, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 448/5 పరుగులు చేసింది.