అన్నమయ్య: కురబలకోటలో ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్, మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి రోడ్డు ప్రమాదాలకు కారణమైతే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. శుక్రవారం ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్లు బైకులతో స్టంట్లు చేస్తూ పట్టుబడ్డారు. వారిని స్టేషన్కు తీసుకువచ్చి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.