TG: హైదరాబాద్లో టీడీఆర్ బాండ్ల జారీలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేత అనుచరుడి కనుసన్నల్లోనే టీడీఆర్ల బ్లాక్ దందా కొనసాగుతోందన్నారు. GHMCలో టీడీఆర్ల కృత్రిమ కొరత సృష్టించి కాంగ్రెస్ గద్దలు వేల కోట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు.