PDPL: ఉత్తర భారత రాష్ట్రాల్లోని కార్మికుల సౌకర్యార్థం 13 అమృత్ భారత్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో రెండు తెలంగాణకు కేటాయించారు. ఇందులో భాగంగానే జోగ్బాని- ఈరోడ్ మధ్య నడిచే(16601/02) అమృత్ భారత్ రైలుకు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.