NLG: నకిరేకల్ మండలం వల్లాలలో నిర్వహించిన అమ్మవారి శోభయాత్ర కన్నుల పండువగా, ఉత్సాహభరితంగా సాగింది. డప్పులు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి భావం ఉట్టిపడేలా అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా పూర్తి చేశారు.