TG: త్వరలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంబంధిత విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు అవసరమైన పరిపాలన ప్రక్రియను ప్రారంభించింది. ఉపాధ్యాయ, పోలీస్, విద్యుత్, గురుకులాల్లో 20 వేల పోస్టులకు ఆర్థిక అనుమతులున్నాయి. ఆర్టీసీ, వైద్య విభాగాల్లో దాదాపు 10 వేల వరకు ఖాళీలుంటాయని అంచనా.