WGL: మధ్యలో చదువు మానేసిన వారికి, ఇంట్లో ఉండి చదువుకోవాలనుకునే వారికి, ఇంకా ఇంటర్లో చేరని విద్యార్థులకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ శుభవార్త చెప్పింది. ఓపెన్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు గడువును అక్టోబర్ 6వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పొడిగించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా సార్వత్రిక విద్య కోఆర్డినేటర్ సదానందం తెలిపారు.