కోనసీమ: ముమ్మిడివరం మండలం తానే లంకలో జీఎస్టీ సంస్కరణల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ జీఎస్టీ సంస్కరణల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇది పేదల జీవితాల్లో వెలుగుల నింపుతుందని ఆయన పేర్కొన్నారు.