SDPT: కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు మూడు శాతం డీఏ పెంచడం శుభపరిణామమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పండుగ పూట ఉద్యోగులకు చేదు ఫలాలను మిగిల్చిందని ఎద్దేవా చేశారు.పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను పెంచకుండా చిన్నచూపు చూస్తోందని విమర్శించారు.