SKLM: లావేరు శాఖా గ్రంథాలయంలో ఆదివారం విద్యార్థులకు పుస్తకాలు పెన్నలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దసరా సెలవుల్లో గ్రంథాలయానికి వస్తున్న విద్యార్థులకు దాతల సాయం నుంచి విద్యార్థులకు ఈ పుస్తకాలు పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం భగత్ సింగ్ జయంతి వేడుకలను నిర్వహించారు.