PLD: పద్మభూషణ్ గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా ఆదివారం వినుకొండ పట్టణంలోని గుర్రం జాషువా కళా ప్రాంగణం ఆవరణలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవులలో జాషువా ఒకరని ఎమ్మెల్యే కొనియాడారు.