NZB: SRSP నుంచి ఆదివారం 3,34,763 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో 39 వరద గేట్ల ద్వారా 3.26 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదులుతుండగా, ఎగువ ప్రాంతాల నుంచి 2,50,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. కాగా, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.50 TMCలకు గాను 60.823 TMC నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.