BDK: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కురుస్తుండడంతో గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను శనివారం ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి నది వరద ఉదృతంగా పెరుగుతున్నందున పరివాహక ప్రాంతాలలో గ్రామాల ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు.