తమిళనాడు తొక్కిసలాట ఘటనకు సంబంధించి DGP జీ.వెంకట్రామన్ స్పందించి కారణాలు వెల్లడించారు. ‘ర్యాలీకి 10 వేల మందికి మాత్రమే అనుమతి ఉండగా.. దాదాపు 30 నుంచి 60 వేల మందికిపైగా తరలివచ్చారు. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు వస్తానని ప్రకటించి.. గంటలు ఆలస్యంగా వచ్చారు. అంతసేపు అభిమానులు తిండి, నీరు లేకుండా వేచి ఉన్నారు. ఈ ఘటనపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు ఆదేశించాం’ అని పేర్కొన్నారు.