KMM: ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని లకారం ట్యాంక్ బండ్ వద్ద శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పర్యాటక శాఖ వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పర్యాటక శాఖ చేపట్టిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు పాల్గొని సందడి చేశారు.