E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదివారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9.30 గంటలకు రాధేయపాలెంలో దసరా ఉత్సవాల్లో పాల్గొంటారు. 10 గంటలకు రాజమండ్రి ఆనంద్ రిజెన్సీలో నిర్వహించనున్న మెడికల్ క్యాంప్‌లో పాల్గొంటారన్నారు. అలాగే, ఉదయం 11.30 గంటలకు రాజానగరంలో నూతనంగా కళ్యాణ మండపం ప్రారంభిస్తారని వివరించారు.