AKP: నక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు, యాదవులు, చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని YCP సీనియర్ నేత వీసం రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. శనివారం ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న కలెక్టర్ విజయకృష్ణన్కు ఆయన వినతిపత్రం అందజేశారు. చేపల విక్రయిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న మత్స్య మహిళలకు ఉపాధి కల్పించాలని కోరారు.