HYD: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను మల్కాజ్గిరి MP ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బోర్డుకు రైల్వేశాఖ నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీలు సుమారు రూ.20 కోట్ల బకాయిలు కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాలని కోరారు. రైల్వే అధికారుల సమావేశంలో చర్చించి చెల్లిస్తామని తెలిపారు.