PPM: జీఎస్టీ తగ్గింపుతో ప్రతీ కుటుంబానికి కలిగే లబ్దిపై ప్రజలకు వివరించాలని సంయుక్త కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది తెలిపారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 వరకు జిల్లాలో *సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్* పేరుతో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జేసీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.