CTR: రేపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో కాణిపాకం అనుబంధ దేవాలయమైన వరదరాజుల స్వామి ఆలయంలో యాదవ వంశస్తులచే గరుడ వాహన సేవ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం ప్రతినిధి నాగరాజు యాదవ్ శనివారం తెలిపారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణ అధికారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.