TG: బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి అనే వ్యక్తి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. బీసీ రిజర్వేషన్లపై హౌస్ మోషన్ పిటిషన్‌కు రిజిస్ట్రీని అనుమతి కోరారు. హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో హౌస్ మోషన్ పిటిషన్ ఉంది. బీసీలకు 42 శాతం కేటాయిస్తూ ప్రభుత్వం నిన్న జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.