KMR: రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లిలో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానాన్ని హైకోర్టు జడ్జి నరసింగరావు ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు ఆలయ చరిత్రను వారికి వివరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆయనకు శాలువాతో సన్మానించి, స్వామివారి జ్ఞాపకను అందజేశారు.