SRCL: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సమాజం తరపున ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. బీసీ బిడ్డ కాకపోయినా, రాహుల్ గాంధీ మాట కోసం సీఎం ఈ రిజర్వేషన్లు కల్పించారన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే అసెంబ్లీ బిల్లును కేంద్రం పట్టించుకోలేదన్నారు.