ADB: కౌర గ్రామానికి చెందిన పాండురంగ్ అనే రైతు శుక్రవారం సాయంత్రం సాంగ్వి శివారులోని తన పత్తి పంటను పరిశీలించడానికి వెళ్ళాడు. అక్కడ అడవి పంది ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. ఈ ఘటనలో రైతు తీవ్రంగా గాయపడటంతో, అతన్ని చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించారు. ఈ సంఘటన మండలంలో కలకలం సృష్టించింది.