'BJP harassed Yediyurappa, his tears have flown on streets of Karnataka,' dk Shivakumar
dk Shivakumar:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం ఊపందుకుంది. అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వర్ పీక్కు చేరుకుంది. మాజీ సీఎం యడియూరప్పను (Yediyurappa) బీజేపీ (bjp) హైకమాండ్ వేధించిందని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (dk shivakumar) అన్నారు. ఆయన కన్నీటితో కర్ణాటక వీధులు తడిచిపోయాయని హాట్ కామెంట్స్ చేశారు. బెంగళూరులో గల రిట్జ్ కార్ల్టన్ వద్ద ‘కర్ణాటక రౌండ్ టేబుల్ 2023’ డిస్కషన్ జరిగింది. సమావేశంలో పాల్గొన్న డీకే శివకుమార్ (dk shivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు.
యడియూరప్పపై (Yediyurappa) బీజేపీ హై కమాండ్ ప్రెషర్ పెట్టిందని చెప్పారు. యడ్డీని బీజేపీ వేధించిందనేది రహస్యం ఏమీ కాదన్నారు. సొంత పార్టీ, దర్యాప్తు సంస్థల నుంచి యడియూరప్ప వేధింపులకు గురయ్యారని వివరించారు. యడియూరప్ప (Yediyurappa) నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. లింగాయత్ కులానికి చెందిన బలమైన నేత.. కర్ణాటకలో విజయం సాధించాలంటే ఆ సామాజిక వర్గం ఓట్లు ముఖ్యం.
ప్రస్తుతం కర్ణాటకలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం బొమ్మై ఉన్నప్పటికీ ఆ స్థాయిలో లీడ్ చేసే స్థాయిలో లేరు. పైగా సిట్టింగులకు మొండి చేయి చూపించారు. నిజానికి కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చింది యడియూరప్ప(Yediyurappa). కానీ వయోభారంతో అతన్ని సీఎం పదవీ నుంచి తప్పించారు.
కర్ణాటక ప్రజలు మంచి విద్యావంతులు అని.. దేశంలో అవినీతికి రాజధానిగా కర్ణాటక ఉందని డీకే శివకుమార్ (dk shivakumar) ఆరోపించారు. ప్రధాని మోడీ (modi) ఏం చేస్తున్నారని అడిగారు. రాష్ట్రానికి వచ్చి ప్రసంగం చేసి.. వెళతారని చెప్పారు. అవినీతి నిర్మూలనపై ఏమీ చేయలేదని మండిపడ్డారు. కర్ణాటక ప్రభుత్వంలో 40 శాతం కమిషన్ వసూల్ చేస్తారని ఆరోపించారు.