NLR: కావలి పట్టణంలో CITU నేతలు శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో తీర్మానించిన కార్మిక చట్ట సవరణను రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పెంచిన పని గంటలు తగ్గించాలని, మహిళలకు రాత్రి డ్యూటీలు రద్దు చేయాలన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు.