SGR: మనూరు మండలం డొవ్వూరు గ్రామపంచాయతీ వద్ద చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతి కార్యదర్శి నరేష్, ఐలమ్మ సంఘం నాయకులు రాజ్ కుమార్ తదితరులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన మహిళ చాకలి ఐలమ్మ అని కొనియాడారు.