NTR: ‘విజయవాడ ఉత్సవ్’కు రావాల్సిందిగా ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్రావు, బోడే ప్రసాద్ ఆహ్వాన పత్రికను అందించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పే చారిత్రాత్మక ఉత్సవాలుగా నిలుస్తాయి అన్నారు.