GNTR: భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం వరకు బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 3,37,525 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. కెఈ మెయిన్, కె డబ్ల్యు మెయిన్లకు 8,035, 5,009, కెనాల్స్‌కు 13,044 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.