AP: రాష్ట్రంలో GST రేట్లు తగ్గడంతో ఇప్పటికే ప్యాక్ చేసి ఉన్న పాత సరుకుల విక్రయంపై నెలకొన్న గందరగోళానికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 22వ తేదీకి ముందు తయారైన, ప్యాక్ చేసిన వస్తువులపై కొత్త MRP స్టిక్కర్ వేయాల్సిన అవసరం లేదని, పాత MRP స్టిక్కర్ను తొలగించొద్దని స్పష్టం చేసింది. పాత MRP ధరలతో ఉన్న నిల్వలను 2026 మార్చి 31 వరకు అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది.