KNR: నగరంలోని 53వ డివిజన్ కాశ్మీర్గడ్డలో భారీ వర్షాల కారణంగా కూలిన డ్రైనేజీ మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. స్థానికుల ఫిర్యాదుపై మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి పనులు చేపట్టారు. సోమవారం మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి పనులను పరిశీలించారు. అధికారులు వెంటనే స్పందించినందుకు ప్రజల తరపున సునీల్ రావు ధన్యవాదాలు తెలిపారు.